తాత జయంతి రోజున అఖిల్ గిఫ్ట్..

అఖిల్ , హలో చిత్రాలతో అభిమానులను పెద్దగా అలరించలేకపోయిన అఖిల్..ప్రస్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యం లో సెప్టెంబర్20 న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు..

ఆ రోజు అక్కినేని నాగేశ్వర్ రావు జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తే బాగుందని ఆ రోజు ఫిక్స్ చేసారు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘సవ్యసాచి’ ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.