#RRRలో అక్షయ్ కుమార్ !

దర్శకధీరుడు రాజమౌళి మల్టీస్టారర్ లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన ‘ఆర్ఆర్ఆర్’ అతిథి పాత్రలో కనిపిస్తారని, పాత్ర చిన్నదే అయినా ఆసక్తికరంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారమ్ ప్రకారం అజయ్ దేవగణ్ స్థానంలో అక్షయ్ కుమార్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.

రాజమౌళి అజయ్ దేవగణ్ ని సంప్రదించిన మాట నిజమే. ఆయన కూడా రాజమౌళి సినిమాలో నటించేందుకు ఆసక్తిని కనబర్చారు. ఐతే, కొన్ని కారణాల వలన అజయ్ దేవగణ్ ఆర్ ఆర్ ఆర్ లో నటించడం లేదట. ఆ కారణాలంటీ ? అనేది తెలియరాలేదు. ఆ తర్వాత రాజమౌళి అక్షయ్ కుమార్ ని సంప్రదించడం.. ఆయన వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయినట్టు సమాచారమ్. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ కు మరింత క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఎన్ టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా #RRR తెరకెక్కుతోంది. హీరోయిన్స్ ఇంకా ఫైనల్ కాలేదు. రామ్ చరణ్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటించనుంది. ఎన్టీఆర్ కి జంటగా ఫారిన్ బ్యూటీని తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి. డివివి దానయ్య నిర్మించనున్నారు.