#RRR కోసం అలియా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. గురువారం ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించి సినిమా విశేషాలని తెలిపింది. ఇందులో రామ్ చరణ్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ని తీసుకొన్నారు. దాదాపు రెండు నెలల ముందు నుంచే అలియా భట్‌తో చిత్ర బృందం చర్చలు జరుపుతోందట. రాజమౌళి కథ చెప్పగానే నచ్చిందని, తప్పకుండా అలియా మాటిచ్చిందట.

అంతేకాదు.. ఆర్ ఆర్ ఆర్ కోసం అలియాకు భారీ రెమ్యూనరేషన్ అందబోతున్నట్టు సమాచారమ్. ఆమెకు రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్ల ముట్టనున్నట్టు టాక్. బాలీవుడ్ సినిమాలకి గానూ అలియా రూ. 7కోట్లకి పైగా తీసుకొంటోంది. ఆర్ ఆర్ ఆర్ కోసం అలియా బల్క్ కాల్షీట్లు కేటాయించడంతో రేటు కూడా పెరిగినట్టు తెలుస్తోంది.