అలియా భట్ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో చూశారా.. ?


బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. బాహుబలితో ఇంటర్నేషనల్ ప్రేక్షకులని మెప్పించిన రాజమౌళి మల్టీస్టారర్ #ఆర్ఆర్ఆర్ లో అలియా అవకాశం దక్కించుకోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అలియా గురించి ఆన్ లైన్ లో వెతికి తెలిసుకొంటున్నారు. ఇదేలా ఉంటే.. ఇవాళ అలియా పుట్టినరోజు జరుపుకొంటోంది.

గురువారం అర్థరాత్రి నుంచి అలియా భర్త్ డే సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. అర్ధరాత్రి తన బర్త్‌డే వేడుకలని స్నేహితులు, సన్నిహితుల మధ్య గ్రాండ్‌గా జరుపుకుంది. డిజైనర్ మసబ గుప్తా, చిన్ననాటి స్నేహితురాలు అనుష్క రంజన్‌తో పాటు రణబీర్ కపూర్ కూడా హాజరైనట్టు తెలుస్తుంది. అలియా భట్ బర్త్‌డేకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.