బన్నీ డబుల్ యాక్షన్


స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ సడెన్ టాప్ గేర్ వేసేశాడు. వరుసగా మూడు సినిమాలని లైన్ లో పెట్టేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఈ నెల 24 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండనుంది. ఇక, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఐకాన్ తెరకెక్కనుంది.

ఈ సినిమా =బౌండ్ స్క్రిప్టుతో రెడీగా ఉంది. బన్నీఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు ఈ చిత్రం పట్టాలెక్కేస్తుంది. అంతేకాదు.. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాక్. వేణు శ్రీరామ్ ఒక చమక్కుతో ఇందులో హీరో ద్విపాత్రాభినయాన్ని డిజైన్ చేశాడట. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.