ఆమె కన్నుకొడితే బన్నీ కూడా పడిపోయాడు

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.. ఒక్క రోజులోనే స్టార్ డమ్ సంపాదించుకొంది. ఆమె నటించిన ‘ఓరు అదార్‌ లవ్‌’ సినిమాకు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇప్పుడీ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోకి 40 లక్షల వ్యూస్‌ కూడా వచ్చాయి.

ఈ సాంగ్‌లో తరగతి గదిలో జరిగే ఈ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. హీరో హీరోయిన్‌ల కనురెప్పలతోనే మాట్లాడుకుంటారు. వారు కనురెప్పలు ఎగరేయడం, కన్ను కొట్టుకొవడం వంటి హావభావాలతోనే లవ్‌ ప్రపోజ్‌ చేసుకుంటారు. ఈ వీడియోకు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయాడు. ఏకంగా తన ట్వీటర్‌ అకౌంట్‌లో ఆ వీడియోను పోస్టు చేశాడు. నేను చూసిన క్యూట్‌ వీడియోల్లో ఇది ఒకటి. ది పవర్‌ ఆఫ్‌ సింప్లిసిటీ. లవ్‌ ఇట్‌’ అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశాడు.