సమంత కు అమల ఛాలెంజ్..

ఛాలెంజ్ ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది..సినీ , రాజకీయ , క్రీడా ఇలా అన్ని రంగాల వారు ఛాలెంజ్ పేరుతో మరొకరికి సవాల్ విసరడం చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే స్వచ్ఛ భారత్ ఛాలెంజ్..కికి ఛాలెంజ్.. హగ్ ఎ ట్రీ ఛాలెంజ్..ఐస్ ఛాలెంజ్ ..ఇలా చాలానే రాగా.. తాజాగా రీడింగ్ ఈజ్ గుడ్ చాలెంజ్ పేరుతో మరో ఛాలెంజ్ వచ్చింది. మరి ఏది ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ అక్కినేని అమల దగ్గరకు వచ్చింది.

రామ్ ప్రసాద్ అనే వ్యక్తి అమల కు ఛాలెంజ్ విసరగా..అమల దాన్ని స్వీకరించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ విషయాన్ని తెలుపుతూ ” రామ్ ప్రసాద్ గారి ‘రీడింగ్ ఈజ్ గుడ్ ఛాలెంజ్’ ను నేను స్వీకరించాను. నేను ‘స్టోరీస్ ఎట్ వర్క్’ అనే పుస్తకాన్ని చదువుతానని హామీ ఇస్తున్నాను. ఈ ఛాలెంజ్ కు సమంతా అక్కినేని.. సుమంత్.. ఉపాసన కొణిదెల ను నామినేట్ చేస్తున్నానని” అంటూ ఒక ఫోటో పోస్ట్ చేశారు. మరి ఈ ఛాలెంజ్ ను సమంత.. ఉపాసన.. సుమంత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.