‘అంతరిక్షం’ ట్రైలర్ ముహూర్తం ఫిక్స్ !

మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దానికి ‘అంతరిక్షం’ టైటిల్ నే ఫిక్స్ చేశారు. 9000 కేఎంపీహెచ్‌ అన్నది ట్యాగ్ లైన్. ఇందులో అదితి రావ్‌‌ హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పుడీ సినిమా ట్రైలర్ కి ముహూర్తం ఫిక్సయింది. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు ట్రైలర్ ను వదలనున్నట్టుగా వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా మెగాబ్రదర్స్ చిరు, పవన్ లని ఆహ్వానించారని తెలిసింది. మరీ.. అంతరిక్షం కోసం చిరు, పవన్ లలో ఎవరు వస్తారన్నది చూడాలి.

మరోవైపు, ఈ సినిమా కథ ఇదేనని.. ఓ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ప్రకారం సినిమాలో వరుణ్ తేజ్ నాసా సైంటిస్ట్ గా కనిపించబోతున్నాడు. కొన్ని కారణాల వల్ల ఉద్యోగం వదిలేసిన హీరో, ఒక విపత్కర పరిస్థితిని చక్కదిద్దడానికి మళ్లీ నడుం బిగిస్తాడట. ఈ క్రమంలో ఇండియాకు అంతరిక్షం నుంచి రాబోయే పెను ఆపదను ఎలా నివారిస్తాడన్నది సినిమా కథగా చెబుతున్నారు.