ఐరెన్ లెగ్ బ్యూటీకి హిట్ పడిందోచ్..

అ, ఆ , ప్రేమమ్ చిత్రాలతో యూత్ ను ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత 2017 ‘శతమానంభవతి’ చిత్రం తో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయింది. ఈ సినిమాలో ఆమె నటనకు , ఆమె అందానికి అంత ఫిదా అయ్యారు. దీంతో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టాయి.

ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమ కోసమే ఇలా వరుస అవకాశాలు వచ్చినప్పటికీ అమ్మడికి మాత్రం ఒక్క హిట్ దక్కలేదు. ఈమె నటించిన అన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైన ఫలితాలను చూశాయి. దీంతో అమ్మడిని ఐరెన్ లెగ్ జాబితాలో చేర్చారు. వీటి తర్వాత తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా రాకపోయేసరికి , కన్నడలో ప్రవేశం చేసింది.

ఆలా వెళ్లిందో లేదో ఏకంగా పవర్ స్టార్ పక్కన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. పునీత్ రాజ్ కుమార్ – అనుపమలు నటించిన ‘నటసార్వభౌమ’ గత వారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు కనపరుస్తూ వార్తల్లో నిలిచింది. ఈ సినిమా హిట్ తో అనుమప వరుస ఫ్లాపులకు బ్రేక్ పడినట్లు అయ్యింది. మరి ఈ సినిమా సక్సెస్ తో అమ్మడికి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.