చిత్ర సీమ షాక్..హార్డ్ డిస్క్‌లో మహేష్ , ఎన్టీఆర్ చిత్రాలు…

తెలుగు చిత్ర సీమ ను లీకుల బెడద ఎంతలా ఇబ్బంది పెడుతుందో తెలియంది కాదు..ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో ఈ లీకుల మరింత వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలకు సిద్దమైన గీత గోవిందం చిత్రం బయటకు రావడం తో అంత షాక్ లో పడ్డారు. కేవలం ఈ సినిమా మాత్రమే కాదు..మహేష్ మహర్షి , ఎన్టీఆర్ అరవింద లు సైతం ఓ హార్డ్ డిస్క్‌లో బయటపడడం తో చిత్ర నిర్మాతలకు ఉలిక్కిపడేలా చేసింది.

తాజాగా హైదరాబాద్‌లో రాజేష్ అనే సినిమా ఎడిటర్‌ని అరెస్ట్ చేసి.. అతడి దగ్గరనుంచి ఒక హార్డ్‌డిస్క్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ హార్డ్ డిస్క్‌‌లో ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో వున్న భారీ సినిమాలకు సంబంధించి రా ఫుటేజ్ ఉండడం తో షాక్ అయ్యారు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అరవింద వీరరాఘవ’ సినిమాకు సంబంధించిన రా ఫుటేజ్‌ తో పాటు, మహేష్ – వంశీ పైడిపల్లి కాంబోలో వస్తున్న ‘మహర్షి’ సినిమాకు సంబంధించిన రా ఫుటేజ్‌ కూడా ఉండడం అందర్నీ అయోమయంలో పడేసింది.

ఈ చిత్రాలతో పాటు ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ చిత్రాలకు సంబందించిన ఫుటేజ్ ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ రాజేష్ ఐపీ ఆడ్రస్‌ను ట్రేస్ చేయగా.. ఆంధ్రప్రదేశ్‌లోకి గుంటూరుకు చెందిన 17 మంది విద్యార్థులకు ఈ సైబర్ క్రైమ్‌లో ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు మరో రెండు రోజుల్లో మరికొంత మంది విద్యార్ధుల్ని అరెస్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలు మాత్రమేనా..మరి ఇంకేమైనా ఉన్నాయా..అసలు ఇంత జరుగుతున్న చిత్ర నిర్మాతలు , మిగతావారు ఏమి చేస్తున్నారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.