విజయ్-అట్లీ సినిమా.. స్వల్ప మార్పులు !

తమిళ్ స్టార్ విజయ్ కి హ్యాట్రిక్ సినిమాలు కలిసొస్తున్నాయి. మురగదాస్ – విజయ్ ల కలయికలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘సర్కార్’ కమర్షియల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో వీరి కలయిలో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో విజయ్-మురగలది హ్యాట్రిక్ – బ్లాక్ బస్టర్ హిట్స్ కాంబోగా నిలిచింది.

ఇప్పుడు మరో హ్యాట్రిక్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. అట్లీ-విజయ్ కలయికలో వచ్చిన తేరి, మెర్సల్’ సినిమాలు బక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం వీరి కలయికలో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే స్కిప్ట్ పూర్తయింది. పూర్తి స్క్రిప్టుని విన్న విజయ్ అట్లీకి కొన్ని మార్పులు సూచించాడట. ఇప్పుడా పనుల్లో దర్శకుడు ఉన్నాడు. అవి పూర్తవ్వగానే సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారు.