నాని నిర్మాత వ్యవహరించిన ‘అ’ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నానికి నచ్చడంతో అతడికే దర్శకుడిగా తొలి అవకాశం ఇస్తూ, తానే నిర్మాతగా మారాడు. ఈ సినిమాలో రెజీనా నిత్యా మీనన్, కాజల్, నానీ, రవితేజ, ఈషా రెబ్బా, మురళీ శర్మ, ప్రియదర్శి లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. యు/ఎ సర్టిఫికెట్ ని పొందింది. తాజాగా, ఈ సినిమా థీమ్ సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సాంగ్ కు రాబిన్ సంగీతం సమకూర్చాడు. ఈ సాంగ్ ను ఓసారి వినేయండీ.. !