‘ధృవ్’లో మేటరు లేదా.. ?

కోలీవుడ్ అర్జున్ రెడ్ది ‘వర్మ’ వివాదం గురించి తెలిసిందే. వర్మ రీ-షూట్ కి రెడీ అవుతున్నారు. దర్శకుడు బాల, హీరోయిన్ మేఘా చౌదరిని పక్కనపెట్టేసి.. వారి స్థానంలో కొత్తవారిని తీసుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వివాదంపై దర్శకుడు బాల తొలిసారి స్పందించారు. ‘నిర్మాతలు ఇచ్చిన అబద్ధపు స్టేట్‌మెంట్ల వల్ల నేను వివరణ ఇవ్వాల్సివస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాలన్నది నా సొంత నిర్ణయమే. ధృవ్‌ విక్రమ్‌ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేద్దాం’ అని అనుకుంటున్నానన్నారు.

దర్శకుడు బాల మాములోడు కాదు. జాతీయ అవార్డులు అందుకొన్న దర్శకుడాయన. అలాంటి దర్శకుడిని పక్కనపెట్టడం ఏంటీ ? అనే కామెంట్స్ వినిపిస్తున్నారు. వర్మ విషయంలో అసలు మైనస్ ధృవ్ అనే కామెంట్స్ వినబడుతున్నాయ్. హీరోగా తొలిసినిమా చేస్తున్న ధృవ్ అర్జున్ రెడ్ది లాంటి పాత్రని మోయలేకపోతున్నాడని కోలీవుడ్ సమాచారమ్. ఐతే, కొడుకు కెపాసిటీని అంచనా వేయకుండా విక్రమ్ మాత్రం దర్శకుడు,హీరోయిన్ ని మార్చి.. వర్మ రీషూట్ కి వెళ్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.