ఎన్టీఆర్ ఎవరో తెలిసిపోయింది !

ntr

మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్’ని తెరకెక్కించే ప్రయత్నంలో.. ఆయన కుమారుడు, హీరో నందమూరి బాలకృష్ణ ఉన్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఉండనుంది. ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రముఖ సినీ విశ్లేషకుడు.. ఎన్టీఆర్’గా బాలకృష్ణ కనిపించబోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ స్ర్కిప్ట్ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే యేడాది జనవరి నుంచి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

balayya

మరోవైపు, ఎన్టీఆర్ బయోపిక్ పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఎన్ టీఆర్ జీవితంలోని లక్ష్మీ పార్వతీ ఏపీసోడ్ ని ఆయన సినిమాగా తీయబోతున్నారు. ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైటిల్ ని ఖరారు చేశారు. వచ్చే యేడాది ఫిబ్రవరిలో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లి.. అక్టోబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.