బాలయ్య కోసం బోయపాటి వెయిటింగ్ తప్పదు.. !

బాలయ్య-బోయపాటి కలయికలో హ్యాట్రిక్ సినిమా ఫిక్సయింది. ముహుర్తం కూడా త్వరలో జరిగిపోతుంది. కానీ, సినిమా రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. బోయపాటి ఇంకా స్కిప్టుని పూర్తి చేయలేదు. మరోవైపు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. బాలయ్య మరోసారి హిందూపురం నుంచి బరిలోకి దిగనున్నారు. ఏప్రియల్ అంతా ఎన్నికల మీద, మే అంతా కొత్త ప్రభుత్వ హడావుడి మీద వుంటారు.

ఈ నేపథ్యంలో జూన్ లోనే బోయపాటి-బాలయ్య సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయ్యేలా కనబడుతోంది. ఎన్నికల తర్వాత చేసే సినిమా కాబట్టే.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథని పక్కనపెట్టేసి.. యాక్షన్ ఎంటర్ టైనర్ కథని రెడీ చేస్తున్నాడంట బోయపాటి. అంతేకాదు.. మార్చిలో సినిమా మొదలెట్టేసి.. ఆ తర్వాత జూన్ వరకు బోయపాటిని బాలయ్య తనవెంటే తిప్పుకోనున్నాడట. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత ఇద్దరు కలిసి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.