శ్రీ‌దేవి మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు : బాలకృష్ణ

అతిలోక సుందరి శ్రీదేవి మరణం భారత సినీ ఇండస్ట్రీని, ప్రేక్షకులని షాక్ కు గురిచేసింది. ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. శ్రీ‌దేవి మ‌ర‌ణం భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోట‌ని హీరో బాల‌కృష్ణ అన్నారు. “ఆమె హఠాన్మరం చాలా బాధాకరం. ఆమెతో కలసి నాన్నగారు ఎన్నో సినిమాల్లో నటించారు. ఎలాంటి భావాన్నైనా కళ్లతోనే పలికించగలిగిన మహానటి ఆమె. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్నా”నన్నారు. ఈ మేరకు ఓ ప్రకటనని విడుదల చేశారు.

శ్రీదేవి మృతదేహం దుబాయ్ నుంచి ముంబైకు తరలించే ప్రయత్నాలు జరుగుతునాయి. రాత్రి 7గం॥లకు మృతదేహాం ముంబైకు చేరుకోవచ్చని చెబుతున్నారు. రేపు ముంబైలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.