రాజకీయాలకి రిటైర్మెంట్ ప్రకటించిన బడా నిర్మాత


టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రాజకీయ ప్రస్థానం ముగిసింది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆరునెలలు గడవక ముందే.. ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. గతేడాది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హోదాలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడుతో గొంతుకోసుకుంటానన్నారు. ఎన్నికల ఫలితాలపై బండ్ల ని బ్లేడ్ గణేష్ గా కామెంట్స్ వినిపించాయి.

ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బండ్ల రాజకీయ సన్యాసం ప్రకటన చేశారు. రాజకీయాలు తనకి సరిపడవు. రాజకీయాల్లో ఉండటం కారణంగా మిత్రులకి దూరం అవుతున్నా. అది నాకు నచ్చడం లేదు. నాకు రాజకీయాల చేయడం రాదు. అందుకే తప్పుకొంటున్నా అన్నారు బండ్ల. ఇక, ఏపీలో పవన్ కల్యాణ్ అధికారంలోకి రావాలని కోరుకుటున్నట్టు తెలిపారు బండ్ల