విజయ్ కి సారీ చెప్పిన డైరెక్టర్..


విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో డియర్ కామ్రేడ్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం తో భరత్ కమ్మ అనే నూతన డైరెక్టర్ ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. తెలుగు , తమిళ్ , మళయాలం , కన్నడ ఇలా నాల్గు భాషల్లో ఏక కాలం లో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్ర రెండో సాంగ్ ను సోమవారం విడుదల చేయాలనీ భావించారు.

ఆ మేరకు ప్రకటన కూడా చేసారు. కానీ చివరి నిమిషం విడుదల వాయిదాపడింది. డైరెక్టర్ భరత్ అందుబాటులో లేకపోవడం ఈ సాంగ్ ను కట్ చేయడం కుదరలేదట. దీంతో మే 15 కు వాయిదా వేశారు. 15 వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు డియర్ కామ్రేడ్ లోని రెండో పాట విడుదల కానుంది. ఈ నేపథ్యంలో భరత్ విజయ్ కి సారీ చెప్పారు.