‘భరత్ అను నేను’ కొత్త షెడ్యూల్ డిటేల్స్

mahesh babu

సూపర్ మహేష్ బాబు మళ్లీ పనిలో పడనున్నారు. ‘స్పైడర్’ రిలీజ్ తర్వాత ‘భరత్ అను నేను’ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొన్న మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్’కి చెక్కేసిన విషయం తెలిసిందే. ఆ ట్రిప్’కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి కూడా. ఇప్పుడు మహేష్ ఫారిన్ టూర్ ని ముగించుకొని తిరిగి రానున్నారు. వచ్చి రాగానే మళ్లీ ‘భరత్ అను నేను’ షూటింగ్ లో జాయిన్ కానున్నారు.

ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల 15నుంచి మొదలుకానుంది. ఇప్పటికే అందుకు గల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, హీరోయిన్ కైరా అద్వానీ కూడా పాల్గొననున్నారు. ‘శ్రీమంతుడు’ తర్వాత కొరటాల-మహేష్ కలయికలో వస్తోన్న చిత్రం కావడంతో ‘భరత్ అను నేను’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇందులో మహేష్ ఏకంగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.