భారత్ ట్రైలర్ టాక్


బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘భారత్’. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వ వహిస్తున్నారు. కత్రినా కైఫ్ హీరోయిన్. కన్నడ నటుడు కిచ్చ సుధీప్ విలన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఐదు విభిన్న గెటప్స్ సల్మాన్ కనిపించిన సన్నివేశాలు ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. కత్రినా కైఫ్ ప్రభుత్వ అధికారిణిగా తన గెటప్ తో మెప్పించింది. సినిమాలో దిశా పటాని మరో ముఖ్య పాత్రల్లో కనిపించనుంది. రంజాన్ కానుకగా జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్ ని మీరు ఓసారి చూసేయండీ.. !