అందుకే ‘భారతీయుడు 2’ ఆగిపోయింది !

శంకర్ – కమల్ హాసన్ కలయికలో ‘భారతీయుడు 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభం అయ్యింది. కొన్నాళ్లపాటు షూటింగ్ సజావుగానే సాగింది. ఆ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. ఇందుకు పలు కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు, దర్శకుడు శంకర్‌కు మధ్య బడ్జెట్‌ విషయంలో అభిప్రాయభేదాలు వచ్చాయని అందుకే సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. సంగీత దర్శకుడిగా ఏ.ఆర్‌ రెహమాన్‌ను కాకుండా అనిరుధ్‌ రవిచందర్‌ను తీసుకోవడం ఓ కారణం అనుకొన్నారు.

అసలు ఈ సినిమా ఆగిపోవడానికి కమల్ మేకప్ కారమట. సినిమాలో కమల్‌హాసన్‌కు వేస్తున్న మేకప్‌ వల్ల ఆయనకు అలెర్జీ వస్తోందట. మొదట్లో మేకప్‌ కారణంగా కమల్‌కు అలెర్జీ రావడంతో కొన్ని రోజులు చిత్రీకరణ ఆపారట. కొంతకాలం గ్యాప్‌ ఇచ్చి మళ్లీ మేకప్‌ వేసి చూడగా అదే పరిస్థితి ఎదురైందట. దాంతో ఆయనకు కొన్ని రోజుల పాటు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. అదీకాకుండా సినిమా మొత్తంలో దాదాపు కమల్‌ వృద్ధుడి గెటప్‌లోనే ఉండాలి. అంటే ఎక్కువ సేపు మేకప్‌తోనే ఉండాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతానికి కమల్ కి విశ్రాంతి నిచ్చారు.