మొత్తానికి భీష్మ రెడీ అవుతున్నాడు..

లై, చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం చిత్రాలతో వరుస ప్లాప్స్ అందుకున్న హీరో నితిన్..ప్రస్తుతం ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే సినిమా చేయబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ గురించి మీడియా లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సెట్స్ పైకి వెళ్తుందంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ సినిమా మాత్రం ముందుకు కదలకపోయేసరికి , అసలు ఈ సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అయ్యాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫిబ్రవరి 25 నుండి వెళ్ళబోతున్నట్లు పక్కాగా తెలుస్తుంది. నితిన్ సరసన ఈ మూవీ లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా , ఛలో ఫేమ్ మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదలకానుంది.