అమెరికాలో బిచ్చమెత్తుకొంటున్న బాలీవుడ్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరో అమెరికాలో బిచ్చమెత్తుకొంటూ కనిపించాడు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అరే.. స్టార్ హీరోకు ఈ గతి ఎందుకు పట్టిందీ.. ? నెటిజర్స్ ఆరా తీస్తున్నారు. దీనికి సమాధానం దొరకాలంటే ‘సంజు’ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. అవును.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితంలో చోటు చేసుకొన్న ఘటన ఇది. ఈ సన్నివేశాన్ని ఆయన బయోపిక్ ‘సంజు’లో చూపించబోతున్నాడు.

తాజాగా, ఆ సన్నివేశానికి సంబంధించిన పిక్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు దర్శకుడు హిరాణీ. మాదకద్రవ్యాలకు అలవాటుపడిన సంజయ్‌ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఓసారి అక్కడి రిహాబ్‌ సెంటర్‌ నుంచి సంజయ్‌ పారిపోయి తన స్నేహితుల ఇళ్లకు వెళ్లడానికి అక్కడి రోడ్లపై డబ్బుల కోసం బిచ్చమెత్తుకున్నట్లు పోస్టర్‌పై రాసుంది. సంజు జీవిత ప్రయాణం ఎన్నో ఒడుదుడుకులతో కూడుకున్నది. కొన్ని విషయాలు మీరు నమ్మలేని విధంగా ఉంటాయి. సంజు కథ తెలిస్తే నమ్మలేరు కానీ ఇది నిజం కామెంట్ పెట్టాడు హిరాణీ.

సంజయ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్ బీర్ సింగ్ కనిపించనున్నాడు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్స్ . సంజయ్‌ తల్లి నర్గిస్‌ పాత్రలో మనీశా కోయిరాలా, తండ్రి సంజయ్‌ దత్‌ పాత్రలో పరేశ్‌ రావల్‌ నటించారు. జూన్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.