ప్రధానితో బాలీవుడ్ సెల్ఫీ.. అదిరింది !


బాలీవుడ్ ప్రముఖుల టీమ్ ప్రధాని నరేంద్ర మోదితో దిగిన సెల్ఫీ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ విషయమేమిటంటే.. ? కరణ్ జోహార్ నేతృత్వం బాలీవుడ్ టీమ్ గురువారం ప్రధానిని కలిసింది. భారతదేశ అభివృద్ధిలో ఫిలిం ఇండస్ట్రీ ఎలాంటి పాత్ర పోషించాలి.. తమ వైపు నుండి ఎలాంటి సహకారం అందించాలి అనే విషయాలపై ప్రధానితో చర్చించారట.

ఈ సందర్భంగా ప్రధానితో తీసుకొన్న సెల్ఫీ పిక్ ని రణవీర్ సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. “గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోది గారిని కలవడం ఒక గొప్ప అవకాశం. భారతదేశానికి ఫిలిం ఇండస్ట్రీ తరపున ఏం చేయగలమో చర్చించాం. మన దేశానికి ఎంతో చేయాల్సి ఉంది. భారత దేశంలో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావాలని మేమందరం కోరుకుకుంటున్నాం” రాసుకొచ్చారు రణ్ వీర్.

ఈ సెల్ఫీ పిక్ లో రణబీర్ కపూర్.. రణవీర్ సింగ్.. సిద్ధార్థ్ మల్హోత్రా.. ఆయుష్మాన్ ఖురానా.. విక్కీ కౌశల్.. రాజ్ కుమార్ రావ్.. అలియా భట్.. ఏక్తా కపూర్.. భూమి పెడ్నేకర్.. రోహిత్ శెట్టి.. అశ్విని అయ్యర్ తివారిలు ఉన్నారు.