భాస్కర్ ఇంకా వండలేదు

అఖిల్ – బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో గీతా ఆర్ట్స్ ఓ సినిమా సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈపాటికే ఈ చిత్రం ప‌ట్టాలెక్కాలి. హీరోయిన్ దొరక్కపోవడమే సినిమా ఆలస్యానికి కారణమనే ప్రచారం జరిగింది. ఐతే, అసలు కారణం అది కాదట. సెకండాఫ్ విష‌యంలో ఓ క్లారిటీ రాలేద‌ని తెలుస్తోంది. మ‌రీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ బాగా రాసుకున్న భాస్క‌ర్‌… ఇంట్ర‌వెల్ ద‌గ్గ‌ర నుంచి ప్రీ క్లైమాక్స్ వ‌రకూ క‌థ‌ని న‌డ‌ప‌డంలో ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని తెలుస్తోంది.

ముందు చేతిలో ఉన్న సీన్లు తీసేద్దామని భాస్క‌ర్ తొంద‌ర‌ప‌డుతున్నా… అల్లు అర‌వింద్ మాత్రం వినడం లేదు. కాంగారేం లేదు. స్క్రిప్టు పూర్తిగా సిద్ధ‌మ‌య్యాకే మొద‌లెడ‌తాం అంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం గీతా ఆర్ట్స్ ఆఫీసులో సెకండాఫ్ కోస‌ం కుస్తీలు పడుతున్నారు. ఒక‌రిద్ద‌రు రైట‌ర్ల‌ని తీసుకొచ్చి, కూర్చోబెట్టినా సెకండాఫ్ తేల‌డం లేద‌ని టాక్‌. మరీ.. భాస్కర్ సెకాంఢాఫ్ ని ఎప్పుడు వండుతాడో.. ఎప్పుడు సినిమా మొదలవుతోందో చూడాలి.