మెగాస్టార్’తో బోయపాటి సినిమా ఇంకా సెట్ కాలేదట !


ఊరమాస్ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉండబోతుందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ సైరా సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలోనే మెగాస్టార్ సినిమా ఉండబోతుందనే కామెంట్స్ వినిపించాయి. ఐతే, ఇటీవలే త్రివిక్రమ్ సినిమాని మెగాస్టార్ ప్రకటించడంతో.. ప్రకటించేశారు. దీంతో చిరుతో బోయపాటి సినిమాపై అనుమానాలు తలెత్తాయి.

వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న బోయపాటి మెగాస్టార్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ‘కొన్ని కథల గురించి చిరంజీవిగారితో మాట్లాడుతున్నాను. ఇప్పుడాయన ‘సైరా’ పనిలో నిమగ్నమయ్యారు. ఆయన స్థాయిలో సరైన కథ పక్కాగా ఖరారైన తర్వాతే అది పట్టాలెక్కుతుంది’ అన్నారు.