సెకాంఢాప్ స్క్రిప్ట్ లేకుండానే సెట్స్ పైకి !


స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ 19వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 24 నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పుడీ సినిమా గురించి షాకింగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తికాలేదట. ఇటీవల ఫస్ట్ హాఫ్ ఫుల్ నెరేషన్ ఇచ్చేసారు త్రివిక్రమ్. కానీ సెకండాఫ్ ఫ్లో మాత్రమే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆలస్యం అయినందున, బన్నీ వెనుక మరో రెండు కమిట్ మెంట్స్ వున్నందును సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. ఒక పక్క ఫస్ట్ హాఫ్ చేస్తూనే.. సెకండాఫ్ స్క్రిప్ట్ డెవలప్ చేసి, ఫైనల్ నెరేషన్ ఇస్తారని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో బన్నీకి జంటగా పూజా హెగ్డే జతకట్టనున్నారు. టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తల్లి సెంటిమెంట్ బలంగా ఉండనుంది. అందుకే టబు ని తీసుకొన్నట్టు టాక్.