విజయ్ దేవరకొండ సినిమాలో నటించాలని ఉందా.. ?

సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాలనే ఆసక్తి ఉన్న వారికి అద్భుతమైన అవకాశం. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ‘కామ్రేడ్’ కోసం కొత్తవారిని తీసుకోనున్నారు. ఈ నెల 16, 17 తేదీలలో కాకినాడలో ఆడిషన్స్ నిర్వహించనున్నారు. నటన పట్ల ఆసక్తి వున్నవారు ఎవరైనా ప్రయత్నించొచ్చు. కాకినాడ మున్సిపల్ ఆఫీస్ పక్కనే వున్న ‘గాంధీభవన్’ లో అడిషన్స్ జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు హాజరుకావలసి ఉంటుంది.

కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కామ్రేడ్ తెరకెక్కనుంది. విజయ్ సరసన రష్మిక మందన జతకట్టనుంది. త్వరలోనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన కామ్రెడ్ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవకొండ.. తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకొంటున్నారు.