చైతూ నటించిన చెత్త సినిమాలు ఇవే !

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య – అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ టైటిల్ రోల్ లో నటిస్తోంది. వినాయక చవితి కానుకగా ‘శైలజారెడ్ది అల్లుడు’ రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న చైతూ.. తన కెరీర్ గురించి బోలేడు ముచ్చట్లు చెప్పారు.

తన కెరీర్ లో ‘ప్రేమమ్‌’ బెస్ట్‌ సినిమా. ఈ సినిమాలో చైతూ నటనకు గానూ ప్రశంసలు అందుకొన్నారు. ఇక, దడ, బెజవాడ సినిమాలు చెత్త సినిమాలన్నాడు. ఆ సినిమాలు చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని తెలిపారు. ఈ రెండు కూడా మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి నిరాశపరిచాయి.

ఇప్పటి వరకు చైతూ రొమాంటిక్ హీరోగా ఆకట్టుకొన్నాడు. యాక్షన్ ఆయనకు పెద్దగా కలిసిరాలేదు. రారండోయ్ వేడుక చూద్దంతో ఫ్యామిలీ ప్రేక్షకులకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇప్పుడు శైలజా రెడ్డి అల్లుడు కూడా ఇదే జోనర్ కి చెందిన సినిమా కావడం విశేషం.