సారీ చెప్పిన చైతు..

నాగ చైతన్య నటించిన తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు..మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వినాయకచవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలెక్షన్ల పరంగా చైతు కెరియర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు పూర్తిగా అలరించలేకపోయింది. రొటీన్ కథ తో తెరకెక్కడం తో మొదటి రోజు మొదటి షో తోనే మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చైతూ అభిమానులకు అలాగే సమీక్షకులకు సారీ చెప్పాడు.

“రిలీజైన పొద్దున్న కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. కొంతమంది సమీక్షకుల్ని సంతృప్తి పరచలేకపోయాను. నన్ను క్షమించండి. నెక్ట్స్ మూవీకి మరింత కష్టపడతాను.” అంటూ చైతు తెలియజేసాడు. గతంలో నెగెటివ్ రివ్యూస్ రాసిన వాళ్లపై స్టార్ హీరోలే విరుచుకుపడిన సందర్భాలున్నాయి. కానీ చైతు మాత్రం ఎలాంటి నోరు జారకుండా స్టేట్మెంట్ ఇవ్వడం అందర్నీ సంతోష పరిచింది. రమ్యకృష్ణ ప్రధాన రోల్ లో నటించిన ఈ మూవీ ని సితార ఎంటెర్టైమెంట్స్ వారు నిర్మించారు.