చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కార్తీ సినిమా


టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరో కార్తీ. ఆయన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతూ ఉంటుంది. ఐతే, ఎప్పటి నుంచో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనే ఆలోచనలో కార్తీ ఉన్నాడు. ఐతే, ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. కార్తీ తాజా చిత్రం ‘దేవ్’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీకి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు మీడియాకు కార్తీ ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఈ సందర్భంగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేయడంపై స్పందించారు.

‘చాన్నాళ్ల నుంచి స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలని అనుకొంటున్నా. ‘ఊపిరి’ తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశా. ఐదారు కథలు కూడా ఉన్నాడు. కానీ, వర్కవుట్ కాలేదు. చంద్రశేఖర్ ఏలేటి రెండు కాన్సెప్టులు చెప్పారు. రెండూ నచ్చాయి. స్టోరీ కంప్లీట్ అయ్యాక కలుస్తానన్నారు. చర్చలు నడుస్తున్నాయి. చూడాలి ఏం అవుతుందో ?’ అన్నారు కార్తీ.