ఛార్మి..పూరి ని ఇబ్బంది పెట్టదల్చుకోవడం లేదా..?

హీరోయిన్ గా కొంతకాలం ఓ వెలుగు వెలిగిన ఛార్మి..ఆ తర్వాత ఐటెం సాంగ్స్ లతో అలరించింది..ప్రస్తుతం సినిమాలు వదిలేసి ప్రొడక్షన్ హౌస్లో బిజీ అయ్యింది. డైరెక్టర్ పూరి తో కలిసి వరుస సినిమాలు నిర్మిస్తుంది. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా పెట్టుబడి పెడుతుంది. ప్రస్తుతం పూరి చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ , రొమాంటిక్ చిత్రాలకు ఛార్మి కో ప్రొడ్యూసర్ గా వహిస్తుంది.

తాజాగా ఛార్మి ఇకపై ప్రమోషన్ విషయంలో మొత్తం తానే చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట..పూరి ని ఇబ్బంది పెట్టకుండా ఆయన సినిమా ఫై ఫోకస్ చేస్తే , ఛార్మి ప్రమోషన్ , ప్రొడక్షన్ వ్యవహారాల ఫై ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. నిన్న రొమాంటిక్ గురించి ఫేస్ బుక్ లో వీడియో అనౌన్స్ మెంట్ కూడా ఆమె చేసింది.

ఇస్మార్ట్ శంకర్ రొమాంటిక్ ఫలితాల మీద ధీమాగా ఉన్న ఛార్మీ నిర్మాతగా సక్సెస్ జెండా ఎగురవేయడం కోసం ఎదురు చూస్తోంది. మరి ఈ రెండు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.