సింధు మీనన్‌ చీట్ చేసిందా ?


హీరోయిన్ సింధు మీనన్‌ ఈ పేరు అందరికీ సుపరిచితమే.. చందమామ, వైశాలి, భద్రాచలం, త్రినేత్రం, శ్రీరామచంద్రులు, ఇన్‌‌స్పెక్టర్‌తో పాటు పలు సినిమాలతో తెలుగులో నటించి మెప్పించింది. కాగా బ్యాంకు నుంచి నకిలీ పత్రాల ద్వారా భారీ స్థాయిలో అప్పు చేసి.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించని వ్యవహారంతో వార్తల్లోకి వచ్చింది సింధూమీనన్. తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ నటించిన మలయాళీ భామ అరెస్టుకు కూడా ఇప్పుడు ప్రయత్నాలు సాగుతూ ఉండటం గమనార్హం.

అసలేం జరిగిందంటే.. బ్యాంక్ ఆఫ్ బరోడా బెంగళూరు శాఖ ఒక దాని నుంచి సింధూ మీనన్, ఆమె సోదరులు ముప్పై ఆరు లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నారట. దీనికి పూచికత్తుగా సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న ఆస్తులు ఏవీ వాస్తవంలో లేవని బ్యాంకు అధికారులు గుర్తించారు. ఆమె నకిలీ డాక్యుమెంట్స్ ను సమర్పించి.. అప్పు తీసుకుందని తెలుస్తోంది. ఈ మొత్తంతిరిగి చెల్లించకపోవడంతో.. అసలు కథ మొత్తం వెలుగులోకి వచ్చింది.