ఆ సింగర్ సీరియస్ అయ్యింది !!

భర్త విషయంలో సింగర్ చిన్మయి సీరియస్ అయ్యింది. ఆమె భర్త, నటుడు రాహుల్ రవిచంద్రన్ దర్శకుడిగా `చిలసౌ’తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆయన రెండో సినిమా నాగచైతన్య హీరోగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే చైతూ కథని ఓకే చేసినట్టు తెలిసింది.

ఈ హ్యాపీ మూడ్ లో చిన్మయి ట్విట్టర్ లో అభిమానులతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఒకరు రాహుల్ రవీంద్రన్ ని ఎప్పుడైనా కొట్టారా ? అని ప్రశ్నించాడు. దానికి ఫీలయిన చిన్మయి “నాకు వేరే ఏం పని లేదు కాబట్టి అతన్ని రోజుకి ఒక్కసారయినా కొడుతాను. అసలేం ఏం ప్రశ్నండీ ఇది` అంటూ రిప్లై ఇచ్చారు. దీనిపై చిన్మయి మాటల్లో కూడా హింసని భరించలేని వ్యక్తి తెలుసా? అంటూ భర్త రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశారు. సినిమా వాళ్లు కదా.. ? అని అందరినీ ఇలాంటి ప్రశ్నలు వేయొద్దుని చిన్మయి చెప్పకనే చెప్పింది.