‘రంగస్థలం’లో మెగాస్టార్ కూడా.. !!

సుకుమార్ – రామ్ చరణ్’ల రంగస్థలంలో మెగాస్టార్ చిరంజీవి కూడా కనిపించబోతున్నాడు. అలాగని సినిమాలో కాదు. పాటల “రంగస్థలం”లో మాత్రమే. ఈ నెల 18న ‘రంగస్థలం’ ఆడియో వేడుకని వైజాగ్ ఆర్కే బీచ్ లో ఘనంగా నిర్వహించబోతున్నాడు. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. దీంతో.. పాటల ‘రంగస్థలం’లో మెగాస్టార్ ని చూసుకొనే మెగా అభిమానులు మురిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. చరణ్ సరసన సమంత జతకట్టనుంది. ఇప్పటికే ‘రంగస్థలం’ నుంచి బయటికొచ్చిన చిట్టిబాబు, రామలక్ష్మీ ల టీజర్స్, పాటలు అదరగొడుతున్నాయి. విభిన్నమైన నేపథ్యాన్ని ఎంచుకొన్న సుకుమార్ రంగస్థలంతో రామ్ చరణ్ కి హిట్ ఇవ్వడం ఖాయమనే టాక్ కూడా మొదలైపోయింది. ఇప్పుడంతా ఆడియో వేడుక వేదికగా మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్ కాబోతున్న ట్రైలర్ బీభత్సం గురించి చర్చించుకొంటున్నారు.

ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.