చిన్నల్లుడుకి చిరు సలహా.. !

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’గా తెరకు పరిచయమయ్యాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ విజేతకు విజయం దక్కలేదు. సినిమా సక్సెస్ – ఫెయిల్యూర్ సంగతి పక్కన బెడితే ‘విజేత’ కు పూర్ ఓపెనింగ్స్ రావడం అందరినీ షాక్ కి గురించి చేసింది. ఇదే విషయం మెగా ఫ్యామిలీ ని ఆలోచనలో పడేసిందట. ఈ నేపథ్యంలోనే అల్లుడికి ఓ సలహా ఇచ్చాడట మెగాస్టార్.

రెండో సినిమా సైన్ చేసేలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకోమని సలహా ఇచ్చాడట. ఆ సమయంలో నటనను మెరుగుపరుచుకోవడంతో పాటు డ్యాన్స్ – ఫైట్స్ లో కూడా మెళకువలు నేర్చుకోమని సూచించాడట. మామగారి సలహాతో కళ్యాణ్ ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నాడని సమాచారమ్. అంతేకాదు.. అల్లుడి రెండో సినిమాని ఒక సీనియర్ దర్శకుడి చేతిలో పెట్టే ఆలోచనలో ఉన్నారట మెగాస్టార్.