చిత్రలహరి @20కోట్లు !

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజు ఫెల్యూర్ స్టోరి చిత్రలహరి హిట్ టాక్ సొంతం చేసుకొంది. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. చిత్రలహరి రూ. 10కోట్లతో తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమా రూ. 20కోట్లు కలెక్ట్ చేసింది. ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ 12.5 కోట్ల రూపాయలని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 5 రోజుల్లో రూ.9.86 కోట్ల షేర్‌ను రాబట్టిందని తెలుస్తోంది. దాంతో బయ్యర్ల పెట్టుబడిలో 80శాతం వెనక్కు తెచ్చింది.

ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ కథానాయికలు. సునీల్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, చెరుకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.