చిత్రలహరి బార్.. కాదు పోరి !

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజు రొటీన్ మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టాయి. ఆయన నుంచి ప్రేక్షకులు కొత్తదనం కోరుకొంటున్నారు. అందుకే ‘తేజ్ ఐ లవ్ యు’తో కొత్తగా ట్రై చేశాడు తేజు. ఐతే, అదీ రొటీన్ లవ్ స్టోరీ కావడంతో ప్రేక్షకులు రిజక్ట్ చేశారు. దీంతో మరింత కొత్తగా కనిపించేందుకు తేజు తాపత్రయ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమాలో నటించబోతున్నారు. ‘బార్ అండ్ రెస్టారెంట్’ అనే ట్యాగ్ లైన్ ను పరిశీలిస్తున్నారు.

దీంతో.. ‘చిత్రలహరి’ అనేది ఆ సినిమాలో వుండే బార్ పేరు అనే ప్రచారం జరిగింది. ఇప్పుడీ సినిమా టైటిల్ గురించి మరో అప్ డేట్ బయటకు వచ్చింది. ‘చిత్రలహరి’ అన్నది సినిమాలో బార్ పేరు మాత్రమే కాదట. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఒకరి పేరు చిత్ర. మరొకరి పేరు లహరి. ఈ ఇద్దరు ఫ్రెండ్స్. వీరిలో ఒకరిని హీరో ప్రేమిస్తాడు. మరొకరు హీరోను ప్రేమిస్తారుని తెలిసింది.

ఈ సినిమా కోసం ఇప్పటికే నివేధా థామస్ ని తీసుకొన్నారు. మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి వుంది. ప్రస్తుతం రెస్ట్ తీసుకొంటున్న తేజు.. కొత్త లుక్ ని ట్రై చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం కోసం తేజు కాస్త సన్నబడనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.