‘చిత్రలహరి’ మూడు రోజుల వసూళ్లు

కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, నివేద పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన చిత్రం చిత్రలహరి. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రలహరి హిట్ టాక్ సొంతం చేసుకొంది. దీంతో మంచి వసూళ్లు రాబడుతోంది. చిత్రలహరి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.75 కోట్ల షేర్ రాబట్టింది.

పలు ఏరియాలలో బయ్యర్లు లాభాలకు చేరువవుతున్నారు. తొలి వారం ముగిసే సమయానికి చిత్రలహరి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీం తర్వాత తేజుకు దక్కిన విజయం ఇదే. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రలో దాదాపు 3 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత శని, ఆదివారం రోజు కూడా జోరు కొనసాగించింది.