మెగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’. సంక్రాంతి కానుకగా ఈరోజు (బుధవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసేంది. థియేటర్స్ లో ప్రేక్షకుల హంగామా చూస్తుంటే... మెగా ఖైదీపై సినీ స్టార్ ఏమన్నారంటే ?

chiru-2
మెగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’. సంక్రాంతి కానుకగా ఈరోజు (బుధవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసేంది. థియేటర్స్ లో ప్రేక్షకుల హంగామా చూస్తుంటే మెగా ప్రభంజనం మళ్లీ మొదలైందని అనిపిస్తోంది.

అయితే, రిలీజ్ కి కొన్ని నిమిషాల ముందు సినీ ప్రముఖులు మెగాస్టార్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. నందమూరి బాలకృష్ణ , అక్కినేని నాగార్జున , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , విక్టరీ వెంకటేష్ , హీరో శ్రీకాంత్ , మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ , నితిన్ , రానా , దర్శకుడు మారుతి మెగాస్టార్ కి ఆల్ దిబెస్ట్ చెప్పేశారు.

ఇప్పుడు మెగా అభిమానులు మెగా యంగ్ హీరోల స్పందన కోసం ఆతృతగా ఎదురు చేస్తున్నారు. ఇప్పటికే ఖైదీ నెం.150 సూపర్ హిట్ అని తేలిపోయింది. మెగా ఖైదీ చూడటానికి స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘డీజే’ షూటింగ్ కి ఈరోజు బ్రేకిచ్చాడు. ఇక, రాంచరణ్ అభిమానుల మధ్య కూర్చోని మెగా ఖైదీ చూస్తానని ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో మెగా ఖైదీపై చరణ్, బన్నీల కామెంట్స్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరీ.. కొన్ని గం॥ల్లో ఈ మెగా హీరోలు మీడియా ముందుకు రావొచ్చు.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్