ఇప్పుడందరి నోట ఇదే మాట. 9యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చినా మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం జోరు.. ఊపు.. గ్రేసు తగ్గలేదని ఖైదీ నెం.150 రుజువు చేసింది. ఇప్పుడీ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.... అదే జోరు.. అదే వూపు.. అదే గ్రేసు.. జై చిరంజీవా

khaidi
ఇప్పుడందరి నోట ఇదే మాట. 9యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చినా మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం జోరు.. ఊపు.. గ్రేసు తగ్గలేదని ఖైదీ నెం.150 రుజువు చేసింది. ఇప్పుడీ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ ప్రముఖులు మెగాస్టార్, ఖైదీ నెం.150కి శుభాంక్షాలు తెలియజేస్తున్నారు.

* రాఘవేంద్రరావు : ‘సినిమా చేసి చాలా రోజులు అయింది’ అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు.. అదే వూపు.. అదే గ్రేసు.. జై చిరంజీవా. జగదేకవీరా.. ఖైదీ నంబర్‌ 150’ అంటూ ట్విట్ చేశారు.

* పరుచూరి బ్రదర్స్ : రీ-ఎంట్రీతో ప్రేక్షకులకు పంచభక్ష్య పరమాన్నాలతో షడ్రసోపేతమైన భోజనం వడ్డించిన మెగాస్టార్‌కి అభినందనలు

* నితిన్ : ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’.. ఇక వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేదు. చరణ్‌, వినాయక్‌.. చిత్రబృందానికి శుభాకాంక్షలు

* మారుతీ : దర్శకుడు మారుతి మెగాస్టార్ చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఇక, రిలీజ్ కి ముందే బాలయ, దర్శకుడు క్రిష్, శ్రీకాంత్.. తదితరులు మెగాస్టార్ కి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికి మెగాస్టార్ రీ-ఎంట్రీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టని తేలడంతో ఇండస్ట్రీలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది.

లేటెస్ట్ గాసిప్స్