‘లవర్స్ డే’పై దీపిక స్పందన ఇది !

ప్రేమికులు పండగ చేసుకొనే ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) రాబోతుంది. ఈ సందర్భంగా లవర్స్ డే పై బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పందించింది. ‘ప్రేమికుల రోజుకు సంబంధించినంత వరకు, ప్రతి రోజు కూడా ‘లవ్ డే’గా జరుపుకోవాలని తాను భావిస్తున్నట్లు తెలిపింది. ఇక, ఈ యేడాదియే దీపిక పదుకొనే ప్రియుడు రణ్ వీర్ సింగ్ ని పెళ్లి చేసుకొనేందుకు రెడీ అయినట్టు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దీపికా పదుకొనే విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ‘సప్నా దీదీ’ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోంది. ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు, రణ్‌వీర్ సింగ్ ‘గల్లీ బాయ్’ చిత్రం కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇదిగాక, తెలుగు టెంపర్ బాలీవుడ్ రిమేక్ లోనూ రణ్ వీర్ కనిపించబోతున్నాడు.