బుడ్డ ఎన్టీఆర్’గా దేవాన్ష్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పటి వరకు నారా ఫ్యామిలీ నుంచి ఏకైక హీరోగా నారా రోహిత్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు లోకేష్ తనయుడు దేవాన్ష్ కూడా తెరకుపరిచయం కాబోతున్నాడు. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో దేవాన్ష్ కనిపించబోటున్నాడు. ఇటీవలే దేవాన్ష్ పై షూటింగ్ కూడా నిర్వహించారు. కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా డైరెక్టర్ చెప్పిన ప్రకారం ఫాలో అయిపోయాడట దేవాన్ష్.

ఇక ఈ సినిమాలో హరికృష్ణ పాత్ర చేసిన కళ్యాణ్ రామ్ కుమారుడు శౌర్యా రామ్ కూడా ఓ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ముత్తాత సినిమాలో మనవళ్లని ఎంట్రీ ఇప్పించడం నారా, నందమూరి కుటుంబ సభ్యులు సెంటిమెంట్ గా ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. మరీ.. ముని మనవళ్లపై ఎన్టీఆర్ ఆశీస్సులు ఏమేరకు ఉంటాయి. సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందన్నది చూడాలి.