‘దేవదాస్’ ఆ డేటుకి ఫిక్సయ్యాడు

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున – నానిల మల్టీస్టారర్ గా ‘దేవదాస్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తోన్నారు. వైజయంతీ బ్యానర్ కు సెప్టెంబర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతోంది. ఆ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు దేవదాస్ విషయంలో అదే సెంటిమెంట్ లో ఫాలో అవ్వనున్నారు. సినిమాని సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారనే ప్రచారం జరిగింది.

ఇప్పుడా ప్రచారం నిజమని తేలింది. దేవదాస్ ని సెప్టెంబర్ 27 రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలోనాగ్ డాన్ గా, నాని డాక్టర్ గా నాని కనిపించబోతున్నాడు. డాన్, డాక్టర్ మధ్య సంబంధం ఏమిటి ? అనేది సినిమా సస్పెన్స్. ఈ చిత్రంలో నాగ్ సరసన ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మందన జతకట్టనున్నారు.