బాస్ ఈజ్ బ్యాక్. ‘ఖైదీ నెం.150’ గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్. దాదాపు 9యేళ్ల తర్వాత అసలుసిసలు మెగా హంగామా కనిపిస్తోంది. మెగా అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఫస్ట్ షోతోనే ఖైదీ... మెగా ఖైదీలో ‘దేవిశ్రీ బావ’ కనిపించాడోచ్ !

devi
బాస్ ఈజ్ బ్యాక్. ‘ఖైదీ నెం.150’ గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్. దాదాపు 9యేళ్ల తర్వాత అసలుసిసలు మెగా హంగామా కనిపిస్తోంది. మెగా అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఫస్ట్ షోతోనే ఖైదీ నెం.150తో బ్లాక్ బస్టర్ హిట్టని తేలిపోయింది.

9యేళ్లు గ్యాప్ వచ్చిన మెగాస్టార్ లో ఏమాత్రం స్వీడు, జోష్ తగ్గలేదని స్పష్టమైంది. ఒకప్పటి స్టప్పులు, స్టయిల్ తో అదరగొట్టాడు. అయితే, మెగా ఖైదీ సూపర్ హిట్ లో మెగాస్టార్ తర్వాత.. ఆ క్రెడిట్ దర్శకుడు వివి. వినాయక్, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కి దక్కుతుంది. దేవి మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ తగ్గ మ్యూజిక్ ఇచ్చేసి.. మెగా ఖైదీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేపథ్య సంగీతంలోనూ తనదైన మార్క్ చూపించాడు.

దేవి శ్రీ బావ వివేక్ కూడా మెగా ఖైదీలో కనిపించాడు. ‘నీరు నీరు.. ‘ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన స్కెచెస్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ స్కెచెస్ వేసింది దేవీ శ్రీ బావ వివేక్. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వివేక్ ని అభినందిచారట. మొత్తానికి.. మెగా ఖైదీలో దేవీ శ్రీ బావ కూడా కనిపించాడు.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్