పెద్ద యాక్సిడెంట్ చేసిన ధృవ్

కోలీవుడ్ స్టార్ విక్రమ్ కొడుకు ధృవ్ పెద్ద యాక్సిడెంట్ చేశాడు. ఈరోజు తెల్లవారుజామున చెన్నైలోని పాండీ బజార్ వెనక రోడ్డు నుంచి వేగంగా వెళ్తున్న ధృవ్ కారు పక్కనే ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆ వెంటనే అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న గుంతలో దిగబడింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ కాలు విరిగింది.

ధృవ్ అంతవేగంగా కారు ఎందుకు నడుపుతున్నాడనే అనేది తెలియాల్సి ఉంది. లేట్ నైట్ పార్టీకి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్నాడని కొందరు ఆరోపిస్తున్నారు. లేదు ఆయన పొద్దున్నే షూటింగ్ కు వెళ్లేందుకు బయల్దేరాడని మరికొందరు అంటున్నారు. ఇందులో నిజం ఏమిటి ? అనేది పోలీసులు తెలియజేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.