chiru-2
మేం చెబుతోంది నిజమే. మెగాస్టార్ ‘ఖైదీ నెం.150’ దిల్ రాజుకి నష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది. అదేలా అంటారా.. ? సంక్రాంతి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ సూపర్ హిట్ గా తేలిపోయింది. దాదాపు 9యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చినా.. మెగాస్టార్ లో ఆ జోరు.. ఆ వూపు.. ఆ గ్రేసు ఏమాత్రం తగ్గలేదని అభిమానులు కితాబిస్తున్నారు. మెగా ఖైదీపై ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

హిట్ టాక్ ని సొంతం చేసుకొన్న మెగా ఖైదీ థియేటర్స్ పెంచేందుకు చిత్రబృందం ట్రై చేస్తోంది. పెంచడం అటుంచి ప్రస్తుతం ఆడుతున్న థియేటర్స్ నుంచి మెగా ఖైదీని తీసేసేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా ఈనెల 14న రిలీజ్ కానున్న దిల్ రాజు ‘శతమానం భవతి’ కోసం బుక్ చేసుకొన్న థియేటర్స్ లో మెగా ఖైదీని తీసెసేందుకు చిత్రబృందం ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో దాదాపు 20 థియేటర్స్ ని దిల్ రాజు వదులుకోవాల్సి వస్తుందట.

ఈ వ్యవహారంలో అల్లు అరవింద్ రంగంలోకి డీల్ సెట్ చేస్తున్నాడంట. అయితే, మొత్తంగా చూస్తే మెగా ఖైదీ కారణంగా దిల్ రాజు కాస్తో.. కూస్తో లాభాలు చవిచూసే ఛాన్స్ ఉన్నట్టు చెబుతున్నారు. మరీ.. ఈ నష్టాన్ని భవిష్యత్ లో ఏ రకంగానైనా ఫిల్ చేస్తామని మెగా కాంపౌండ్ హామీ ఇచ్చినట్టు సమాచారమ్.

లేటెస్ట్ గాసిప్స్