‘చోర’ ఎవరికోసం క్రిష్ ??

Director-Krish-marriage

నందమూరి బాలకృష్ణను గౌతమీ పుత్ర శాతకర్ణిగా చూపించారు క్రిష్. ఇది అద్భుత విజయం సాధించింది. బాల‌య్య బాడీ లాంగ్వేజ్‌ని స‌రిగ్గా అర్థం చేసుకొన్న ద‌ర్శకుల్లో క్రిష్ పేరూ చేరింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో మణికర్ణికతో బిజీ అయ్యారు క్రిష్

అయితే ఇప్పుడు ఆయన తరపు నుండి టాలీవుడ్ లో ఓ టైటిల్ రిజిస్టర్ అయ్యింది తాజగా క్రిష్ తన బ్యానర్ పై ‘చోర’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయడం ఆసక్తిగా మారింది. అయితే ఈ టైటిల్ ఎవరి కోసం రిజిస్టర్ చేయించారో ఇంకా క్లారిటీ రాలేదు. వెంకటేష్ తో ఓ సినిమా అనుకున్నారు క్రిష్. అలాగే కళ్యాణ్ రామ్ తో కూడా ఒక కధ అనుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ టైటిల్ ఎవరి కోసమే అన్నది సస్పెన్స్ గా మారింది. ఏదేమైనా ఇప్పుడు బాలీవుడ్ మణికర్ణికతో బిజీగా వున్నారు క్రిష్.