రూ. 100కోట్ల ఆఫర్ పై దానయ్య స్పందన


#ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ తెరపై వెళ్లక ముందే.. ఆ చిత్ర నిర్మాత డివివి దానయ్యకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలని తప్పుకొంటే రూ. 100కోట్ల ఆఫర్ ఇచ్చారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ప్రచారంపై దానయ్య స్పందించారు. వందకోట్ల ఆఫర్ వచ్చిన మాట వాస్తమే. ఐతే, రాజమౌళి సినిమాని ఎలా వదులుకుంటానన్నారు.

ఇక, #RRR మల్టీస్టారర్ ని దాదాపు రూ. 350-400కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని 2020 జూన్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కొమరంభీమ్ ల కథతో ఈ మల్టీస్టారర్ తెరకెక్కుతోంది.