జాన్వీని శ్రీదేవితో పోల్చడం సరికాదు

దివంగత మహానటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి ‘దఢక్‌’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌ ఈ చిత్రంలో కథానాయకుడుగా నటిస్తున్నారు. మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ‘సైరాట్‌’కు ఇది రీమేక్‌గా రాబోతోంది. ఇటివలే సెట్స్ నుండి కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. ఇందులో అందరూ జాన్వీని శ్రీదేవితో పోల్చారు. అయితే ఇది సరికాదని బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు ఫరా ఖాన్‌ అన్నారు.

‘జాన్వి మంచి డ్యాన్సర్‌. ఏదైనా త్వరగా నేర్చేసుకుంటుంది. ఆమెను తన తల్లితో పోల్చడం సబబు కాదు. జాన్వి వయసు నాటికి శ్రీదేవి సూపర్‌స్టార్‌ అయిపోయారు. కానీ ఇది జాన్వికి తొలి చిత్రం. నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం. నా కెరీర్‌ తొలినాళ్లలో నన్ను బాగా ప్రోత్సహించారు. కానీ ఎవరి వ్యక్తిత్వం వారిది’ అని చెప్పుకొచ్చారు ఫరా.